పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి దక్షిణాఫ్రికా! 12 d ago
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్లో 348 పరుగుల భారీ ఛేదనలో భాగంగా, ఆట చివరిరోజు ఓవర్ నైట్ స్కోరు 205/5తో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక, మరో 33 పరుగులు మాత్రమే జోడించి 238కు ఆలౌట్ అయ్యారు. సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/76) లంక పనిపట్టాడు. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (50), కుశాల్ మెండిస్ (46) ఔట్ అవడంతో సఫారీల విజయం ఖాయమైంది. డేన్ పీటర్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.